ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రశాంత వాతావరణంలో జీవీఎంసీ ఎన్నికలు: సీపీ - vishaka cp review on GVMC elections

జీవీఎంసీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై సీపీ మనీష్‌కుమార్‌సిన్హా అధికారులతో సమావేశమయ్యారు. ఎన్నికల కోడ్‌ అమలు తీరును సమీక్షించారు. ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా జరిపేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

cp Manish Kumar sinha on municipal elections
cp Manish Kumar sinha on municipal elections

By

Published : Mar 9, 2021, 12:21 PM IST

ఈనెల 10న జీవీఎంసీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరపాలని సీపీ మనీష్‌కుమార్‌సిన్హా ఆదేశించారు. ఎన్నికల నేపథ్యంలో సోమవారం సాయంత్రం ఆయన సమావేశ మందిరంలో డీసీపీలు ఐశ్వర్య రస్తోగి, సురేష్‌బాబు, ఏడీసీపీ అజిత వేజెండ్ల, పరిపాలన ఏడీసీపీ రజని, ఎస్​బీ ఏడీసీపీ ఆనందరెడ్డి, ఇతర పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. పోలీసు అధికారులకు కేటాయించిన విధులపై సమీక్షించారు. ఎన్నికల కోడ్‌ అమలు తీరును సమీక్షించారు. నగదు, మద్యం పంపిణీలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా జరిపేలా చూడాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details