విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఐక్య కార్యాచరణ సమితి నిరసనలు చేపట్టింది. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై పార్లమెంట్లో ప్రకటన చేసి వంద రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఆందోళన చేపట్టారు. నిర్విరామ దీక్ష చేస్తున్న కార్మిక, కర్షక వర్గానికి ప్రజలు నుంచి మద్దతు ఉంటుందని కార్మిక నేతలు అన్నారు. కొవిడ్ సమయంలో వేలాది ఆక్సిజన్ అందిస్తూ వేలాది ప్రాణాలు కాపాడుతున్న కేంద్రానికి కనికరం రావడం లేదని.. ప్రైవేటీకరణ నిర్ణయం సరికాదని వారు చెప్పారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా.. కార్మిక నేతల నిరసన - vishakha steel protest news
పార్లమెంట్లో విశాఖ ప్రైవేటీకరణపై నిర్ణయాన్ని ప్రకటించి వంద రోజులవుతున్న సందర్భంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఐక్య కార్యచరణ సమితి నిరసన చేపట్టింది. ప్రైవేటీకరణ ఆలోచనను వెనక్కి తీసుకోవాలని కార్మిక నేతలు డిమాండ్ చేశారు.
![విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా.. కార్మిక నేతల నిరసన vishakha protest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11843368-395-11843368-1621589628944.jpg)
vishakha protest