ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్టీల్​ ప్లాంట్​ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటానికి 100రోజులు.. రాష్ట్రవ్యాప్త నిరసనలు - vishakha steel plant latest news

విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ ప్రైవేటీక‌ర‌ణ‌ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ స్టీల్ ప్లాంట్ ప‌రిర‌క్ష‌ణ ఐక్య కార్యాచ‌ర‌ణ స‌మితి ఆధ్వ‌ర్యంలో కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష‌లు 100వ రోజుకు చేరుకున్నాయి. వారి నిరసనలకు రాష్ట్రవ్యాప్తంగా సీఐటీయూ, పలు కార్మిక సంఘాలు మద్దతు తెలియజేశాయి. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి.

vishakha steel plant
విశాఖ ఉక్కు పరిశ్రమ నిరసనలు

By

Published : May 22, 2021, 3:47 PM IST

విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ప్లాంట్ ఆర్చ్​ వద్ద ఇవాళ వంద అడుగుల బ్యానర్ పట్టుకొని ఆందోళన చేపట్టారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మికుల పోరాట తీరును పోరాట కమిటీ చైర్మన్ సి.హెచ్ నర్సింగరావు కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో విశాఖ ఉక్కుపై ఏకగ్రీవ తీర్మానం చేయడం మంచి పరిణామమన్నారు. ప్రభుత్వం.. అఖిలపక్ష కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలను కలుపుకొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు.

విజయనగరం జిల్లాలో...

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉద్యమం 100వ రోజుకు చేరుకున్న సందర్భంగా విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట కార్మిక సంఘాలు ఉక్కు ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. మోదీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.

శ్రీకాకుళం జిల్లాలో...

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్​పరం చేయొద్దంటూ.. సీఐటీయూ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిరసన ప్రదర్శన జరిగింది. విశాఖ ఉద్యమానికి వందరోజులు పూర్తైన సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు.

ఇదీ చదవండి: 'ఉక్కు పరిరక్షణకు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం'

ABOUT THE AUTHOR

...view details