తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిని కలిశారు. శ్రీవారి ఉత్సవ మూర్తులకు నిత్యాభిషేకాలు నిర్వహించే అంశంపై.. ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహా మండలి సభ్యులు సుందరవదన బట్టాచార్యులు స్వరూపానందేంద్రతో చర్చించారు.వైకుంఠ ద్వారాలను పది రోజుల పాటు తెరిచి ఉంచాలనే ప్రతిపాదనలపై పీఠాధిపతి అభిప్రాయాలను తెలుసుకున్నారు. స్వామి వారికి నిత్యాభిషేకాలు నిర్వహించడం వల్ల ఉత్సవ మూర్తులకు అరుగుదల ఏర్పడుతోందని.. ఆర్జిత సేవలు రద్దు చేయాలని ఆగమ సలహా మండలి అధికారులకు సూచించినట్లు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు.
తిరుమలలో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి - విశాఖ శారదా పీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిని కలిసిన తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు
విశాఖ శారదా పీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తిరుమల చేరుకున్నారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహా మండలి సభ్యులు సుందరవదన బట్టాచార్యులు శ్రీవారి ఉత్సవమూర్తులకు నిత్యాభిషేకాలు నిర్వహించే అంశంపై పీఠాధిపతితో చర్చించారు.
తిరుమలలో విశాఖ శారదా పీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి