నిరుపేదలకు ఆహారం పంపిణీ చేసిన విశాఖ రైల్వే
లాక్డౌన్ కారణంగా చాలామందికి ఆహారం దొరకని పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో ఆహారం అందించేందుకు విశాఖ రైల్వే ముందుకు వచ్చింది. కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఉన్న వారికి ఆహారాన్ని అందించింది.
నిరుపేదలకు ఆహారాన్ని పంపిణీ చేస్తోన్న విశాఖ రైల్వే
కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా విశాఖ నగరంలో చిక్కుకున్న వారికి, పేద ప్రజలకు విశాఖ రైల్వే వండిన ఆహారాన్ని అందించింది. వాల్తేరు డీఆర్ఎం చేతన్‌కుమార్ శ్రీ వాస్తవ ఆదేశాల మేరకు ఐఆర్సీటీసీ బేస్ క్యాంటీన్ రైల్ డాబాలో 500 మందికి సరిపడా ఆహారాన్ని సిద్దం చేసి పంపిణీ చేసింది. ఇందులో 250 భోజనాలు రైతుమిత్ర స్వచ్చంద సంస్థ ద్వారా పంపిణీ చేసింది. రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఉన్న 55 మంది నిరుపేదలకు భోజనాలను ఆర్పీఎఫ్ సిబ్బంది అందించారు.