విశాఖ జిల్లా పాడేరులోని విద్యార్థులకు విశాఖ నేవీ బృందం... నావికాదళంపై అవగాహన కార్యక్రమం నిర్వహించింది. నేవీ ఉద్యోగం అంటే ఏమిటి, దేశానికి నేవీ ఉద్యోగులు చేసే సేవలు, సముద్ర పరివాహక ప్రాంతాల్లో ఎన్ని కేంద్రాలున్నాయన్న అంశాలను విద్యార్థులకు వివరించారు. నేవీలో ఉద్యోగం సాధించాలంటే అర్హత, వయసు, ఏఏ అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలన్న విషయాలను తెలిపారు. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ, సబ్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
మన్యం విద్యార్థులకు నేవీపై అవగాహన - awareness_on_navy
విశాఖ గిరిజన యువతకు నేవీ ఉద్యోగాల్లో అవకాశం కల్పించేందుకు... పాడేరు ఐటీడీఏ వినూత్నంగా కార్యక్రమం నిర్వహించింది. పూర్తి వివరాలపై అవగాహన కల్పించింది.
మన్యం విద్యార్థులకు నేవీపై అవగాహన కార్యక్రమం