'వర్షాలు కురవాలని ముస్లింల నమాజ్' - MUSLIMS
వర్షాలు కురిసి రెండు తెలుగు రాష్ట్రాలు పచ్చగా కళకళలాడుతూ ఉండాలని కోరుతూ విశాఖలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
'వర్షాలు కురవాలని ముస్లింల నమాజ్'
తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవాలని అల్లాను కోరుతూ విశాఖలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాతనగరంలోని కోటవీధి ఈద్గా వద్ద సుమారు వెయ్యి మంది ముస్లింలు కలిసి ప్రత్యేక నమాజ్ చేశారు. జూన్‌లోనూ తీవ్రంగా ఎండలు ఉండటంలో.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బాగా కురిసి ప్రజలకు నీటి కష్టాలు తీర్చాలని అల్లాను ప్రార్ధించినట్లు ముస్లిం మత పెద్దలు తెలిపారు.
Last Updated : Jun 16, 2019, 5:18 PM IST