ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గాజువాక మహిళా కండక్టర్ డ్యాన్స్‌ అదుర్స్‌, టీవీ షోల్లో ప్రదర్శనతో ప్రత్యేక గుర్తింపు

Conductor Jhansi ఆడపిల్లవై ఉండి వేదికలపై డ్యాన్స్‌ చేస్తావా. భవిష్యత్తులో అనేక ఇబ్బందులు పడాల్సివస్తుంది అని కుటుంబ సభ్యులు అడ్డుచెప్పినా డ్యాన్స్‌పై ఉన్న మక్కువతో ఝాన్సీ ముందుకు సాగిపోయింది. వివిధ ప్రదర్శనలతో ప్రతిభ చూపుతోంది. ఇప్పుడు ఆమె డ్యాన్స్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో ఎంతోమంది  ప్రశంసలు కురిపిస్తున్నారు.

conductor jhansi
jhansi

By

Published : Aug 28, 2022, 4:57 PM IST

Updated : Aug 28, 2022, 6:22 PM IST

Conductor Jhansi Dance Talent: ‘‘నేను అట్టాంటి.. ఇట్టాంటి ఆడదాన్ని కాదు బాబోయ్‌... పల్సర్‌ బైక్‌ మీద రాను బాబోయ్‌..’’ అనే పాటకు విశాఖలోని గాజువాక ఆర్టీసీ డిపో కండక్టర్‌గా పని చేస్తున్న ఎ.ఝాన్సీ ఈటీవీలో ప్రసారమయ్యే ‘శ్రీదేవీ డ్రామా కంపెనీ’ షోలో ప్రదర్శించిన ఫోక్‌ డ్యాన్స్‌ ఇప్పుడు కుర్రకారుని హుషారెత్తిస్తోంది. ఈ ప్రదర్శనకు మెచ్చి న్యాయనిర్ణేతలు వేదికపైకి వెళ్లి.. ఆమెతో కలిసి స్టెప్పులేసి అభినందిస్తున్నారు. గాజువాక బీసీరోడ్డుకు చెందిన ఝాన్సీ భర్త నూకరాజు. ఆ దంపతులకు ఇద్దరు సంతానం. అటు ఉద్యోగం, చేస్తూనే ఇటు ఆసక్తి ఉన్న కళలో ప్రశంసలందుకుంటున్నారు.

‘నేను 8వ తరగతిలో ఉండగానే డ్యాన్స్‌ నేర్చుకున్నా. మా ఇంట్లో నృత్య శిక్షణ వద్దని వారించినా ఎంతో కష్టపడి ఇష్టంగా సాధన చేశా. పదో తరగతి పాసయ్యాక.. 2011లో ఆర్టీసీలో కండక్టర్‌గా ఎంపికయ్యా. ఏడాది శిక్షణ తర్వాత గాజువాక డిపోలో విధుల్లో చేరా. డ్యాన్స్‌ మాస్టర్లు శివ, విశాఖ థ్రిల్లర్‌ వెంకట్, శేఖర్, సురేష్‌ వద్ద శిక్షణ తీసుకున్నా. రమేష్‌ మాస్టర్‌ అన్ని విధాలా ప్రోత్సహించి ఆయన బృందంలో చేర్చుకుని వివిధ వేదికలపై ప్రదర్శనకు అవకాశం కల్పించారు’. -ఝాన్సీ

‘ఇప్పటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1500 వరకూ వేదికలపై ప్రదర్శనలు ఇచ్చా. అక్కడి ప్రతిభతోనే టీవీ షోల్లో అవకాశం దక్కింది. ఓ టీవీలో వచ్చిన డ్యాన్సింగ్‌ స్టార్‌ పోటీల్లో ప్రథమ బహుమతి గెలుచుకున్నా. మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా రూ.5 లక్షల నగదు ప్రోత్సాహం అందుకున్నా. మరో ఛానల్‌లో రంగం-2, ఇంకో టీవీలో ప్రసారమైన తీన్మార్‌లో ఉత్తమ డ్యాన్సర్‌ అవార్డులు పొందా. ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో ఎక్కడ కార్యక్రమాలు నిర్వహించినా... డ్యాన్సర్‌గా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంటా. -ఝాన్సీ

‘ఈటీవీలో ప్రసారమవుతున్న ‘శ్రీదేవి డ్రామా కంపెనీ షో’లో డ్యాన్స్‌ చేసిన ప్రోమో ఇప్పుడు వైరల్‌గా మారింది. చాలా మంది ఫోన్లు చేసి ప్రశంసలు తెలియజేస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఈనెల 28న ఆదివారం నేను డ్యాన్స్‌ చేసిన ఎపిసోడ్‌ ప్రసారం కానుంది. డ్యాన్స్‌ గురువు రమేష్, ఆర్టీసీ ఉన్నతాధికారులు, యూనియన్‌ నాయకుడు శంకరరావు అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నారు. భవిష్యత్తులో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకోవడమే లక్ష్యం.

ఇవీ చదవండి:

Last Updated : Aug 28, 2022, 6:22 PM IST

ABOUT THE AUTHOR

...view details