ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రశాంత వాతవరణంలో ఎన్నికలు నిర్వహించాలి' - విశాఖ మున్సిపల్ ఎన్నికల వార్తలు

మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతవరణంలో నిర్వహించేందుకు అధికారులు సహకరించాలని విశాఖ సబ్​ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య కోరారు. ఎన్నికల నియమావళి ప్రకారం విధులు నిర్వర్తించాలని తెలిపారు.

vishakha elections
'ప్రశాంత వాతవరణంలో ఎన్నికలు నిర్వహించాలి'

By

Published : Mar 2, 2021, 11:03 AM IST

ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు సహకరించాలని విశాఖ జిల్లా నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య... ఎన్నికల సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన ఎన్నికల శిక్షణా తరగతులకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం విధులు నిర్వహించాలని పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం జారీచేసిన మార్గదర్శకాలు అమలయ్యేలా చూడాలని చెప్పారు. ఈనెల 2, 3 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. పురపాలక ఎన్నికలకు సంబంధించి ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని తెలిపారు.

చెక్​పోస్ట్​ల ఏర్పాటు..

నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన రహదారుల వద్ద 5 చెక్​పోస్ట్​లను ఏర్పాటు చేశారు. సీఐ స్వామి నాయుడు సారథ్యంలో ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

జోరుగా ప్రచారం..

జీవీఎంసీ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఓటర్లకు పిలుపినిచ్చారు. అనకాపల్లిలో 82వ వార్డు వైకాపా కార్పొరేట్ అభ్యర్థిని మందపాటి సునీత తరఫున ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

తెదేపా అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. 15వ వార్డు కార్పొరేట్​ అభ్యర్థి శ్రీవిద్య ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ తనను గెలిపించాలని కోరారు. 20వ వార్డు కార్పొరేట్​ అభ్యర్థి విజయలక్ష్మి వార్డు పరిధిలోని పలు కాలనీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వారి వెంట తెదేపా సీనియర్ నాయకుడు పోతన రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. వైకాప, తెదేపా అభ్యర్థులు పూరీలు, దోసెలు వేస్తూ వినూత్నంగా ప్రచారం నిర్వహించారు.

ఇదీ చదవండి:

విశాఖ ఉక్కు కోసం 5న రాష్ట్ర బంద్.. గోడ పత్రిక ఆవిష్కరణ

ABOUT THE AUTHOR

...view details