ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీ వేంకటేశ్వరుని సన్నిధిలో ముగిసిన పవిత్రోత్సవాలు - అనకాపల్లి

శ్రీ వేంకటేశ్వర సన్నిధిలో వారంరోజుల పాటు భక్తిశ్రద్ధలతో నిర్వహించిన పవిత్రోత్సవాలు ముగిశాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని.. స్వామి వారిని దర్శించుకున్నారు.

ఉత్సవాలు ఆఖరి రోజున పోటెత్తిన భక్తజనం

By

Published : Jul 19, 2019, 10:06 AM IST

ఉత్సవాలు ఆఖరి రోజున పోటెత్తిన భక్తజనం
విశాఖ జిల్లా అనకాపల్లిలోని దేముని గుమ్మం వేంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ముగిశాయి. చివరి రోజున సుప్రభాత సేవ ప్రారంభించి నిత్యార్చన, సహస్రనామార్చన, నవ కలశ స్నపనం, చక్రస్నానం వసంతోత్సవం నిర్వహించారు. వైకాపా పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు దాడి రత్నాకర్ స్వామిని దర్శించుకున్నారు. లక్ష తులసి అర్చన అనంతరం పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగిశాయి. ఉత్సవాల్లో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా దేవస్థాన అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details