ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంతర్జాతీయ కర్రసాము 2020లో విశాఖకు పతకాల పంట.. - International Cane 2020 chennai latest News

చెన్నైలో జరిగిన మొదటి అంతర్జాతీయ శిలంబం (కర్రసాము) 2020 టోర్నమెంట్​లో విశాఖపట్టణానికి పతకాల పంట పండింది. కర్రసాములో వైజాగ్​కు చెందిన విశాఖ బాలదేవ్ అకాడమీ ఆఫ్ ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులను కలెక్టర్ వి.వినయ్ చంద్ ప్రశంసించారు. అనంతరం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ప్రశంసాపత్రాలను అందజేశారు.

అంతర్జాతీయ కర్రసాము 2020లో విశాఖకు పతకాల పంట..
అంతర్జాతీయ కర్రసాము 2020లో విశాఖకు పతకాల పంట..

By

Published : Sep 24, 2020, 8:02 PM IST

తమిళనాడు చెన్నైలో జరిగిన మొదటి అంతర్జాతీయ శిలంబం (కర్రసాము) 2020 టోర్నమెంట్​లో విశాఖపట్టణానికి చెందిన విద్యార్థులు ఉత్తమ ప్రదర్శన కనబరిచారు. ఈ సందర్భంగా కర్రసాములో వైజాగ్​కు​ చెందిన విశాఖ బాలదేవ్ అకాడమీ ఆఫ్ ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులను కలెక్టర్ వి.వినయ్ చంద్ ప్రశంసించారు. అనంతరం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ప్రశంసాపత్రాలను అందించారు. శిలంబం టోర్నమెంట్​లో బాలదేవ్ అకాడమీ విద్యార్థులు 8 స్వర్ణ, 3 కాంస్య పతకాలను గెలుచుకున్నారు.

  • కర్ర విన్యాసాల్లోనూ..

ఒంటి కర్ర, రెండు కర్రలతో చేసే విన్యాసాల్లో కె.సత్య శ్రీకాంత్ రెండు స్వర్ణ పతకాలు, డి. మహేశ్వరరావు 2 బంగారు పతకాలు సాధించారు. డబుల్ స్టిక్​లో బి.కీర్తిక, పి.ధరణి వర్ష, పి.యశ్వంత్​లు తలా బంగారు పతకం గెలుచుకున్నారు.

  • సుమారు 12 దేశాలు పాల్గొన్నాయి..

సింగిల్ స్టిక్ విభాగంలో బి.సంధ్యారాణి బంగారు పతకం పొందారు. డబుల్ స్టిక్, సింగిల్ స్టిక్ రెండు పోటీల్లో యశ్వంత్ రెడ్డి 2 కాంస్య పతకాలను గెలిచారు. విశాఖ పోర్టు ఉద్యోగి బి.లక్ష్మణ్ దేవ్ శిక్షణలో విశాఖ క్రీడాకారులు విజయం సాధించారు. ఈ పోటీలు చెన్నైలో జూలై 10 నుంచి ఆగస్టు 10 వరకు జరిగినట్లు లక్షణ్ దేవ్ వెల్లడించారు. సుమారు 12 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నట్లు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : హెల్త్ బులెటిన్: ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి విషమం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details