ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

corona effect: సింహాచలం గిరి ప్రదక్షిణ రద్దు - విశాఖ సింహాచలం గిరిప్రదక్షిణ తాజా వార్తలు

కరోనా కారణంగా ఈ ఏడాదీ విశాఖ సింహాచలం గిరి ప్రదక్షిణ రద్దు చేశారు. రాత్రి కర్ఫ్యూ పొడిగింపు, కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈవో సూర్యకళ తెలిపారు.

simhachalam giri pradhakshina
simhachalam giri pradhakshina

By

Published : Jul 21, 2021, 7:04 PM IST

విశాఖ సింహాచలం అప్పన్న ఆలయంలో ఈ ఏడాది కూడా గిరి ప్రదక్షిణను రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో సూర్యకళ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూని ఈ నెల 30 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. రాత్రి కర్ఫ్యూ పొడిగింపు, కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈవో తెలిపారు. సింహగిరిపై కూడా ప్రదక్షిణకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయన్నారు. ఈ నెల 23, 24వ తేదీల్లో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ యథావిధిగా స్వామివారి దర్శనాలు కొనసాగుతాయని చెప్పారు. 23న స్వామివారి మాస జయంతి, 24న తుది విడత చందన సమర్పణ కార్యక్రమాలు ఉంటాయన్నారు. భక్తులు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రతి ఏడాది సుమారు ఐదు లక్షల మంది.. ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటారు. గత ఏడాదీ ఈ గిరిప్రదక్షణ రద్దు చేశారు.

ABOUT THE AUTHOR

...view details