ఉల్లి కోసం విశాఖ వాసులు కష్టాలు
ఉల్లి ఘాటుతో... ప్రజలకు కన్నీరు - latest news on onion
విశాఖ సీతమ్మధార రైతు బజారులో రాయితీ ఉల్లి కోసం ప్రజలు బారులు తీరారు. పనులు మానేసి కాళ్లరిగేలా... ఉల్లి కోసం క్యూలో నిలబడుతున్నామని ప్రజలు వాపోతున్నారు.

ఉల్లి కోసం విశాఖ వాసులు కష్టాలు
విశాఖలోని రైతు బజార్లలో రాయితీ ఉల్లి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఉల్లి నిల్వలు లేవపోవటం వలన ఆదివారం సరఫరా నిలిపివేశారు. ఇవాళ తెల్లవారుజాము నుంచే పేద, మధ్యతరగతి ప్రజలు రైతుబజార్లకు చేరుకుని రాయితీ ఉల్లి కేంద్రాల వద్ద బారులు తీరారు. విశాఖ సీతమ్మధార రైతు బజారులో రాయితీ ఉల్లి కోసం ప్రజలు బారులు తీరారు.