గంజాయి వ్యాపారానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని విశాఖ పోలీసు కమిషనర్ ఆర్కే మీనా హెచ్చరించారు. విశాఖ నగరంలోని అప్పుఘర్ వద్ద ఓ నివాసంలో భారీగా నిల్వ చేసిన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొంత కాలంగా గుట్టు చప్పుడు కాకుండా ఇంటి వద్ద నుంచే గంజాయి వ్యాపారం సాగిస్తోన్న వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నారు. ఒడిశా, కేరళ నుంచి వచ్చిన వీరంతా ఏజెన్సీ నుంచి గంజాయి దిగుమతి చేసుకుని... వివిధ నగరాలకు ఇక్కడ నుంచి సరఫరా చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. గంజాయి రవాణాపై నిఘా మరింత తీవ్రం చేస్తామన్న విశాఖ పోలీసు కమిషనర్ ఆర్కే మీనాతో ఈటీవీ భారత్ ముఖాముఖి...
'గంజాయి వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవు: విశాఖ సీపీ' - latest news of ganjai at vishakapatnam
గంజాయి వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని విశాఖ సీపీ ఆర్కే మీనా అన్నారు. మాదక ద్రవ్యాల సరఫరాపై నిరంతరం నిఘా ఉంటుందని పేర్కొన్నారు.
గంజాయి అక్రమాలపై విశాఖ సీపీ