'దివ్యహత్య కేసులో సమగ్ర విచారణ జరుపుతున్నాం' - divya murder case in vishakapatnam
దివ్య హత్య కేసులో విచారణను ముమ్మరం చేశామని విశాఖ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా వెల్లడించారు. ఆమె హత్య కేసులో ముగ్గురుని అరెస్ట్ చేశామని ఆయన తెలిపారు.
!['దివ్యహత్య కేసులో సమగ్ర విచారణ జరుపుతున్నాం' vishakapatnam commissioner visited fourth town police station](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7571026-157-7571026-1591867760393.jpg)
మాట్లాడుతున్న కమిషనర్ ఆర్కే మీనా
విశాఖపట్నంలోని నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌ను కమిషనర్ ఆర్కే మీనా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దివ్య హత్యపై సమగ్ర విచారణ జరుపుతున్నామని తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశామని ఆయన తెలిపారు. మరో ఇద్దరు వ్యక్తులను విచారిస్తున్నామని , లోతుగా కూపీ లాగుతున్నట్లు వివరించారు.