జగనన్న విద్యా దీవెన పేరుతో సీఎం జగన్ విద్యార్థుల తలపై భస్మాసుర హస్తం ప్రయోగించారని తెదేపా విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్ విశాఖలో ఆరోపించారు. చంద్రబాబు హయాంలో 16 లక్షల మందికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తే వైకాపా దానిని 11 లక్షలకు కుదించిందన్నారు. సుమారు 5 లక్షల మంది విద్యార్థులను మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే హక్కు ముఖ్యమంత్రికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. విద్యార్థుల చదువులపై ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అందరికీ విద్యా దీవెన అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.
'5 లక్షల మంది విద్యార్థులను ప్రభుత్వం మోసగిస్తోంది' - latest news in vishaka district
గత ప్రభుత్వం16 లక్షల మందికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తే.. నేడు వైకాపా 11 లక్షలకు కుదించిందని తెదేపా విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్ ఆరోపించారు. విద్యార్థులను ప్రభుత్వం మోసగిస్తోందని విమర్శించారు.
తెదేపా నేత పాసర్ల ప్రసాద్