ప్రభుత్వంపై తెదేపా అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు మళ్ల సురేంద్ర మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ అలసత్వం వలన విపత్కర పరిస్థితులు ఏర్పడి అందిస్తున్న అరకొర సాయం బాధితులకు అందడం లేదని విమర్శించారు. కరోనా లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు చేయాలంటే మూడు రోజులు పడుతుందని వీటి ఫలితాలు రావడానికి వారం రోజుల సమయం పడుతుందన్నారు. దీని వల్ల కరోనా మరింత మందికి విస్తరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. కరోనా సమయంలో మద్యం దుకాణాలు మూసివేయాలని డిమాండ్ చేశారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ లో మీడియా ప్రతినిధులను చేర్చాలని కోరారు. కరోనాతో ఇబ్బంది పడుతున్న ప్రతి పేద కుటుంబానికి 10వేల ఆర్థిక సాయం చేయాలని వినతి పత్రం అందజేశారు.
కరోనాను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం - tdp fires on government
కరోనాను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమయ్యిందని తెదేపా అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు మళ్ల సురేంద్ర తెలిపారు. విశాఖ జిల్లా అనకాపల్లి ఆర్టీవో సీతారామారావుకి పార్టీ నాయకులతో వినతి పత్రం అందజేశారు.
కరోనాను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం