ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పింఛన్ డబ్బులు అపహరించి.. జూదం ఆడి..! - విశాఖ జిల్లా వార్తలు

పేదలకు ఇవ్వవలసిన పింఛన్ డబ్బులు.. ఓ గ్రామ వాలంటీర్ భర్త దుర్వినియోగం చేసిన ఘటన విశాఖ జి.మాడుగులలోని ఊడపాలెంలో జరిగింది. గ్రామ వాలంటీర్ రాజేశ్వరి పింఛన్ సొమ్మును ఇంట్లో పెట్టగా.. ఆమె భర్త వాటిని అపహరించి జూదం ఆడినట్లు విచారణలో తేలింది.

vishaka udapalam volunteer husband gambling with stolen pension money
పింఛన్ డబ్బులు అపహరించి.. జూదం ఆడి..!

By

Published : Feb 3, 2021, 4:07 PM IST

పేదలకు అందించాల్సిన పింఛన్ సొమ్ములు.. గ్రామ వాలంటీర్ భర్త దుర్వినియోగం చేయడంతో.. గ్రామస్థులు పోలీస్ స్టేషన్​ను ఆశ్రయించారు. విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండలం గెమ్మెలి పంచాయతీ ఊడపాలెంలో.. గ్రామ వాలంటీర్ రాజేశ్వరి, పేదలకు పంపిణీ చేయవలసిన పింఛను సొమ్ము సెక్రటరీ నుంచి తీసుకువచ్చి ఇంట్లో పెట్టింది. ఆమె భర్త రాజందొర ఇంట్లో సొమ్ము తస్కరించి జూదం ఆడాడు. ఈ నెల 1న చెల్లించాల్సిన పింఛను అందకపోవడంతో లబ్ధిదారులు అధికారులకు ఫిర్యాదు చేశారు. జి.మాడుగుల ఎంపీడీఓ వెంకన్నబాబు విచారణ చేయించారు. లబ్ధిదారులకు పింఛను చెల్లించకపోవడంతో పాటు.. ఆరుగురికి డబ్బులు ఇవ్వకుండా ఇచ్చినట్లు రాసుకోవడం వంటి వివరాలను సేకరించారు.

ABOUT THE AUTHOR

...view details