ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉల్లి ధరలపై ఎమ్మెల్యే నిరసన... కేజీ రూ.25కే అమ్మకం - ఉల్లి ధరలపై విశాఖలో తెదేపా నిరసన

ఉల్లిధరలను నిరసిస్తూ... విశాఖలో తెదేపా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్​ రూ.25కే కేజీ ఉల్లిని అమ్మారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉల్లి కష్టాలను తీర్చాలని ఆయన కోరారు.

vishaka tdp mla protest against onion rate by selling 25 per kg
ఉల్లి ధరలపై ఎమ్మెల్యే నిరసన

By

Published : Nov 27, 2019, 8:25 PM IST

ఉల్లి ధరలపై ఎమ్మెల్యే నిరసన... కేజీ రూ.25కే అమ్మకం

ఉల్లి సరఫరాలో ప్రభుత్వ వైఫల్యాన్ని వ్యతిరేకిస్తూ... విశాఖలో తెదేపా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వినూత్న నిరసన చేశారు. కేజీహెచ్ ప్రాంతంలో అన్నక్యాంటీన్ వద్ద 300 మంది పేద ప్రజలకు 300 కేజీల ఉల్లిని కిలో రూ.25కే అమ్మారు. ప్రభుత్వ చర్యలకు నిరసనగా తాను ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

తమ నియోజకవర్గంలో ఉల్లి కోసం పేద ప్రజలు... రైతు బజార్లలో క్యూలైన్లలో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి బాధ చూసి హోల్​సేల్ మార్కెట్లో రూ.75 తాను కొని రూ.25కే అమ్ముతున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉల్లి కష్టాలు తీర్చాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details