ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దళితులపై దాడులకు వ్యతిరేకంగా అంబేడ్కర్ విగ్రహానికి అభిషేకం - రాష్ట్రంలో దళితులపై దాడులు

విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం రొంగలినాయుడుపాలెంలో దళితులపై దాడులకు నిరసనగా తెదేపా శ్రేణులు అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.

vishaka  tdp member on attack on ysrcp group
దళితులపై దాడులకు వ్యతిరేకంగా అంబేడ్కర్ విగ్రహానికి అభిషేకం

By

Published : Aug 13, 2020, 6:08 PM IST

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలపై వరస దాడులు జరుగుతున్నాయని తెదేపా విశాఖ జిల్లా మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు అన్నారు. దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం రొంగలినాయుడుపాలెంలో పార్టీ శ్రేణులతో కలిసి అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.

ఎస్సీ ఎస్టీ, బీసీ ఉప ప్రణాళిక అమలు చేయకుండా ఆ నిధులను పక్కదారి పట్టిస్తున్నారన్నారు రామానాయుడు ఆరోపించారు. 45 ఏళ్లకే పింఛను ఇస్తామని వైకాపా ఎన్నికల్లో హామీ ఇచ్చి మోసం చేసిందని ఆరోపించారు. పోలీసులు శిరోముండనం చేసిన యువకుడు రాష్ట్రంలో ఎస్సీలకు న్యాయం జరగలేదని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

ABOUT THE AUTHOR

...view details