ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంటర్​ పాస్​ కాలేదని విద్యార్థి మృతి - విశాఖ జిల్లాలో మనస్థాపంతో విద్యార్థి మృతి

ఇంటర్ ఫెయిల్ అయ్యానన్న మనస్తాపంతో విద్యార్థి ఉరి వేసుకుని మృతి చెందాడు. ఈ ఘటన విశాఖ జిల్లా మునగపాడు మండలంలో గంటవాని పాలెంలో జరగింది.

ఇంటర్​ పాస్​కాలేదన్న మనస్థాపంతో విద్యార్థి ఉరి వేసుకుని మృతి
ఇంటర్​ పాస్​కాలేదన్న మనస్థాపంతో విద్యార్థి ఉరి వేసుకుని మృతి

By

Published : Jun 13, 2020, 12:04 PM IST

విశాఖ జిల్లా మునగపాక మండలం గంటవాని పాలెంకి చెందిన కొన జగదీష్ అనే విద్యార్థి అనకాపల్లిలోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఫెయిలవ్వటంతో మనస్తాపం చెందిన జగదీష్ ఇంటిలో ఉరి వేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం అనకాపల్లి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు. విద్యార్థి తండ్రి గోవిందు వ్యవసాయం చేసుకుంటూ తన కుమారుడిని చదివిస్తున్నారు. ఇంటర్​ పరీక్ష ఫలితాలు తప్పడంతో మనస్తాపం చెంది కుమారుడు ఈ అఘాయిత్యానికి పాల్పడడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు పలువురిని కలచివేసింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details