విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఆపేందుకు ఈనెల 30వ తేదీలోపు రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షం ఏర్పాటు చేయాలని కార్మిక సంఘాలు కోరాయి. విశాఖలో సమావేశమైన కార్మిక సంఘాల ఐకాస ఛైర్మన్లు.. స్టీల్ ప్లాంట్ కాపాడటం కోసం అన్ని పార్టీలనూ ఏకంచేసి, కేంద్రంతో మాట్లాడాలని సూచించాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి ఈనెల 26న వ్యతిరేకంగా భారీ వంటావార్పు కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఐకాస నేతలు ప్రకటించారు.
VISHAKA STEEL PLANT: ఈనెల 26న ఐకాస వంటావార్పు.. - Dharna against privatization of Visakhapatnam steel plant
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాల ఐకాస వంటావార్పు కార్యక్రమం నిర్వహించబోతోంది. ఈనెల 30వ తేదీలోపు రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షం ఏర్పాటు చేయాలని నేతలు డిమాండ్ చేశారు.
ఈనెల 26న ఐకాస వంటావార్పు కార్యక్రమం