డిసెంబర్ 2 నుంచి 8 వరకు జరిగిన మావోయిస్టు వారోత్సవాలకు గిరిజనులు సహకరించలేదని... విశాఖ జిల్లా ఎస్పీ బాబూజీ వివరించారు. తమకు అభివృద్ధి కావాలని.. మావోయిస్టు అగ్రనేతలతో గిరిజనులు తేల్చి చెప్పినట్లు ఎస్పీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇన్ఫార్మర్ల నెపంతో అమాయక గిరిజనులను బలి తీసుకోవడంపై... వ్యతిరేకత ఏర్పడిందని తెలిపారు. గిరిజనులు మావోయిస్టులకు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు చేశారన్నారు. ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
'మావోయిస్టు వారోత్సవాలకు గిరిజనులు సహకరించలేదు' - విశాఖ ఏజెన్సీ మావోయిస్టు వారోత్సవాలు న్యూస్
మావోయిస్టు వారోత్సవాలకు వ్యతిరేకంగా గిరిజనులు నిరసనలు తెలిపారని... విశాఖ జిల్లా ఎస్పీ బాబూజీ తెలిపారు. ప్రజల్లో మావోయిస్టులపై వ్యతిరేకత ఉందని వ్యాఖ్యానించారు.
!['మావోయిస్టు వారోత్సవాలకు గిరిజనులు సహకరించలేదు' 'మావోయిస్టు వారోత్సవాలకు గిరిజనులు సహకరించలేదు'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5310663-1064-5310663-1575815238113.jpg)
'మావోయిస్టు వారోత్సవాలకు గిరిజనులు సహకరించలేదు'
'మావోయిస్టు వారోత్సవాలకు గిరిజనులు సహకరించలేదు'
ఇదీ చదవండి: కన్నప్రేమ కావాలి... పెంచిన ఆప్యాయత ఉండాలి..!