ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అప్పన స్వామి దర్శనంలో మార్పులు..!

రాష్ట్రంలో ఈ నెల 17తో లాక్​డౌన్ ముగియనుంది. దీంతో విశాఖ అప్పన్న స్వామి దేవాలయంలో భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించేందుకు ముందస్తు ప్రణాళిక రూపొందిస్తున్నారు ఆలయ సభ్యులు.

vishaka-simhachalam
vishaka-simhachalam

By

Published : May 15, 2020, 2:56 PM IST

Updated : May 15, 2020, 3:06 PM IST

విశాఖలోని సింహాచలం దేవాలయంలో 51 రోజుల అనంతరం ప్రభుత్వ ఆదేశాల మేరకు భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించేందుకు ముందస్తు ప్రణాళిక రూపొందిస్తున్నారు. సింహగిరిపై భక్తులు 3 అడుగుల దూరం పాటించేలా చర్యలు తీసుకోనున్నారు. ఏ ప్రాంతంలో శానిటైజర్ సెంటర్ ఏర్పాటు చేయాలనే విషయాన్ని పరిశీలిస్తున్నారు. ముందుగా లఘు దర్శనానికి మాత్రమే భక్తులకు అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. గంటకు సుమారు 250 మంది స్వామి దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకోనున్నారు. దర్శనం టికెట్లు ఆన్ లైన్ ద్వారా ఇవ్వాలా.. లేదా.. అన్నది అధికారులతో చర్చించి నిర్ణయిస్తామని ఆలయ ఈవో వెంకటేశ్వరరావు తెలిపారు. భక్తులకు శఠగోపం పెట్టటం, ప్రసాదాలు పంపిణీ లాంటివి ఏమీ ఉండవని తెలిపారు.

Last Updated : May 15, 2020, 3:06 PM IST

ABOUT THE AUTHOR

...view details