మహాశివరాత్రి పర్వదినాన రాత్రంతా జాగారాలు చేసిన భక్తులు...విశాఖ సాగరతీరంలో పోటెత్తారు.తెల్లవారుజాము నుంచే సముద్రస్నానాలు ఆచరించేందుకు నగరవాసులంతా పెద్ద ఎత్తున తరలివచ్చారు.శివరాత్రి రోజు ఉపవాసం ఉండి రాత్రంగా మేల్కొని...ఉదయాన్నే సముద్రస్నానం చేస్తే శివుని ఆశీస్సులు లభిస్తాయని భక్తుల విశ్వాసం.అనాదిగా వస్తున్న ఈ ఆచారాన్ని జిల్లావాసులంతా పాటిస్తున్నారు.సముద్రస్నానాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు అన్ని చర్యలు చేపట్టారు.గజఈతగాళ్లను పెట్టి పర్యవేక్షిస్తున్నారు.
'సాగర తీరంలో భక్తకోటి' - punyasnananlu
మహాశివరాత్రి పర్వదినాన రాత్రంతా జాగారాలు చేసిన భక్తులు... విశాఖ సాగరతీరంలో పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే సముద్రస్నానాలు ఆచరిస్తున్నారు.
!['సాగర తీరంలో భక్తకోటి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2608081-254-a67340c9-874a-4c19-9cc2-267706bc459d.jpg)
'సాగర తీరంలో భక్తకోటి'