సంక్రాంతి కోసం విశాఖ ఆర్టీసీ ప్రత్యేకంగా 500 బస్సులు తిప్పుతోంది. ముఖ్యంగా హైదరాబాద్, తిరుపతి, కర్నూల్, కడప, విజయవాడ, గుంటూరు ఒంగోలుకు బస్సులు అదనంగా తిరగనున్నాయి. ఎక్కువ రద్దీ ఉండే రాజమండ్రి, కాకాకినాడ, అమలాపురం, రాజోలు, నరసాపురం భీమవరం ప్రాంతాలకు మద్దిలపాలెం డిపో నుంచి ప్రత్యేక బస్సు లను నడపనున్నట్లు వెల్లడించారు. పక్క జిల్లా శ్రీకాకుళం, విజయనగరంలోని ఇచ్ఛాపురం, పలాస ప్రాంతాలకు... అలాగే జిల్లాలో ముఖ్యమైన ప్రాంతాలు నర్సీపట్నం, పాయకరావుపేట, బస్సులు సిద్ధం చేశారు. ప్రయాణికుల రద్దీని బట్టి .. అప్పటికప్పుడు ప్రత్యేకంగా సర్వీస్ తిప్పడానికి వంద బస్సులను అందుబాటులో ఉంచారు. ప్రయాణికులు సంక్రాంతి సెలవులకు ఆర్టీసీ సేవలు వినియోగించుకుని సురక్షిత ప్రయాణం చేయాలని అధికారులు కోరుతున్నారు.
సంక్రాంతికి ప్రత్యేక బస్సులను నడపనున్న విశాఖ ఆర్టీసీ - latest news in vishaka
విశాఖ ఆర్టీసీ కి సంక్రాంతి సందడి వచ్చేసింది. విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు బస్సులను తిప్పుతున్నారు. ప్రయాణికులకు సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా అదనపు బస్సు లను వేస్తున్నట్టు ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు.

సంక్రాంతికి ప్రత్యేక బస్సులను నడపనున్న విశాఖ ఆర్టీసీ