ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ ఆర్టీసీకి 9 రోజుల్లో రూ.5.46 కోట్ల ఆదాయం - VISHAKA RTC LATEST NEWS

కరోనాతో డిపోలకు పరిమితమైన బస్సులు... అన్​లాక్ ప్రక్రియతో రోడ్డెక్కాయి. ఫలితంగా విశాఖ ఆర్టీసీ క్రమంగా ఆదాయాన్ని అర్జిస్తోంది. ఆక్యుపెన్సీ రేటు పెంచుకుంటోంది.

vishaka RTC
vishaka RTC

By

Published : Nov 11, 2020, 7:51 PM IST

రాష్ట్రంలో విజయవాడ తరువాత విశాఖ ఆర్టీసీ ఎక్కువ బస్సు సర్వీసులు నడుపుతోంది. దూర ప్రాంతాలకు జిల్లా నుంచి 1100 సర్వీసులు నడుస్తున్నాయి. అర్బన్ సర్వీసులుగా మరో 1200 బస్సులను నడుపుతున్నారు. కొవిడ్ రాకతో మార్చి నెల నుంచి జూన్ వరకు బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. అన్​లాక్​ నిబంధనలతో మళ్లీ రోడ్డెక్కిన సర్వీసులు.. క్రమంగా ఆక్సుపెన్సీ రేటును పెంచుకున్నాయి. దసరా సమయంలో వంద శాతం ఆక్యుపెన్సీతో బస్సులు నడిచాయి. రైళ్లు సరిగ్గా నడవకపోవటం, ప్రైవేట్ ట్రావెల్స్​లో అధిక ధరలు ఉండటంతో పండగ సమయంలో ప్రయాణికులు ఆర్టీసీని ఆదరించారు. ఫలితంగా 55 శాతం ఉండే ఆక్యుపెన్సీ ప్రస్తుతం 90 శాతానికి చేరింది.

ఒక్క అక్టోబర్ నెలలో 18,123 బస్సులు...59 లక్షల కిలోమీటర్లు తిరిగాయి. నవంబర్ 1 నుంచి 9 వరకు 5257 బస్సులు 19 లక్షల కిలోమీటర్లు తిరిగాయి. ఈ నెలలో 9 రోజులల్లోనే 5.46 కోట్ల రూపాయల ఆదాయాన్ని విశాఖ ఆర్టీసీ సాధించింది. 1.60 లక్షల ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చింది. ప్రయాణికులకు మంచి సౌకర్యాలు, సురక్షిత ప్రయాణ లక్ష్యంతో ఆర్టీసీ ముందుకు వెళ్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details