కరోనాపై విశాఖ ఆర్టీసీ అధికారుల ముందు జాగ్రత్త - corona virus news
కరోనా వైరస్ వ్యాపించకుండా విశాఖ ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బస్సు కాంప్లెక్స్ ప్రాంగణంలో, బస్సు సీట్లల్లో సోడియం ద్రావణాన్ని చల్లిస్తున్నారు. వ్యాధి నివారణకు అధికారులు తీసుకునే చర్యలపై వారితో 'ఈటీవీ భారత్' ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి.
కరోనా వైరస్ కట్టడికి విశాఖ ప్రాంతీయ ఆర్టీసీ చర్యలు తీసుకుంటోంది. విశాఖ ద్వారక బస్సు కాంప్లెక్స్ ప్రధాన కేంద్రంగా చేసుకుని ప్రయాణికులకు అవగాహన కల్పిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అలాగే డ్రైవర్, కండక్టర్లకు మాస్కులు అందిస్తున్నారు. బస్సు కాంప్లెక్స్ ప్రాంగణంలో సోడియం ద్రావణాన్ని చల్లుతున్నారు. విశాఖ మహా నగర పాలక సంస్థ బస్సు కాంప్లెక్స్‌లో రెండు వైద్య శిబిరాలను సైతం ఏర్పాటు చేసింది. కరోనా భయంతో ఏసీ బస్సుల్లో ప్రయాణికులు శాతం తగ్గిందని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. కరోనా నివారణకు ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కరపత్రాలలో ప్రచురించి అందిస్తున్నారు విశాఖ ఆర్టీసీ అధికారులు.