కరోనా నేపథ్యంలో విశాఖపట్నంలో రైల్వే స్టేషన్ ఖాళీ అయ్యింది. అన్ని గ్లేట్లను మూసివేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అత్యవసర సమయాల్లో ఉండేందుకు ఒక గేట్ తెరిచినట్లు వెల్లడించారు. ఎవరినీ స్టేషన్ లోపలికి అనుమతించట్లేదని తెలిపారు. స్టేషన్ మొత్తం పోలీసుల రక్షణలో ఉంది.
ఐసోలేషన్, క్వారెంటైన్ పడకల సంఖ్య పెంచామని కరోనా వ్యాప్తి నివారణ అధికారి ఆంధ్ర మెడికల్ విశ్వవిద్యాలయ ప్రిస్సిపల్ సుధాకర్ తెలిపారు. ప్రజలు నిన్నటిలానే ఇళ్లకు పరిమితమైతే... కరోనా వ్యాప్తి సమర్థంగా నివారించవచ్చని తెలిపారు.