ప్రయాణికుల ఇబ్బందులు దృష్ట్యా విశాఖ రైల్వే స్టేషన్లో మరిన్ని వెసులుబాట్లు కల్పించారు. ఇప్పటివరకు జ్ఞానాపురం వైపు నుంచి మాత్రమే ప్రయాణికులను టిక్కెట్ ఉన్న వారిని పరీక్షించి స్టేషన్లోకి అనుమతించేవారు. రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం నుంచి బయటకు వెళ్లేందుకు అవకాశం ఇచ్చేవారు. దీనివల్ల ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, పిల్లలు, వృద్ధులు చాలా దూరం నడవాల్సి వస్తోందని అధికారులకు పలు విజ్ఞప్తులు చేరాయి. కొవిడ్ నిబంధనలను పాటిస్తూనే ఈ రాకపోకల మార్గాలపై వెసులు బాటు కల్పించాలని నిర్ణయించారు. ఇకపై ప్రధాన మార్గం ఒక గేటు నుంచి వెళ్లేందుకు మరో గేటు నుంచి బయటకు వచ్చేందుకు ప్రయాణికులకు వెసులుబాటు కల్పించారు. అటు జ్ఞానాపురం గేటు వైపు కూడా ఇదే రకమైన విధానాన్ని అనుసరించాలని నిర్ణయించి, దానికి తగిన ఉత్తర్వులను ఇచ్చినట్టు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ త్రిపాఠి వెల్లడించారు.
విశాఖ రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు మరింత వెసులుబాటు
ప్రయాణికుల ఇబ్బందులు, విజ్ఞప్తులు దృష్టిలో పెట్టుకుని విశాఖ రైల్వే స్టేషన్లోకి ప్రవేశం, బయటకు వెళ్లే మార్గాలపై అధికార్లు మరిన్ని వెసులుబాట్లను శుక్రవారం నుంచి అమలు చేయనున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. రాకపోకల మార్గాలపై వెసులుబాటు కల్పించాలని నిర్ణయించారు.
విశాఖ రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు మరింత వెసులుబాటు