ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముగ్గురు యువకుల కిడ్నాప్.. కేసును ఛేదించిన పోలీసులు - విశాఖపట్నం నేర వార్తలు

గోపాలపట్నం పోలీసుస్టేషన్ పరిధిలో కిడ్నాప్​కు గురైన ముగ్గురు యువకుల కేసును పోలీసులు కొద్ది గంటల్లోనే ఛేదించారు. మొత్తం పది మందిని గుర్తించి...వారిలో ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. వ్యాపార లావాదేవీల్లో తలెత్తిన గొడవలే ఈ ఘటనకు కారణమని వివరించారు.

vishaka police
vishaka police

By

Published : Dec 1, 2020, 8:56 PM IST

వ్యాపార లావాదేవీల్లో తేడాల వల్ల డబ్బులు వసూలు చేసుకునేందుకు ముగ్గురిని కిడ్నాప్ చేసి హింసించిన కేసును విశాఖ పోలీసులు ఛేదించారు. ఫిర్యాదు నమోదైన ఎనిమిది గంటల్లోనే నిందితుల్లో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురిని మరికొన్ని గంటల్లోనే అరెస్ట్ చేశారు. గోపాలపట్నం పరిధిలోని ఓ ఆసుపత్రిలో దెబ్బలు తిన్న బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. వారిని నిర్బంధించిన సాగర్ నగర్​లోని గృహంపై దాడి చేశారు. అక్కడ కిడ్నాప్ అయిన మరో యువకుని జాడ తెలియకపోవడంతో ఆరు బృందాలుగా విచారణ చేపట్టారు. మొత్తం పదిమంది నిందితులను గుర్తించి, ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపినట్టు ఏసీపీ పెడారావు వెల్లడించారు. బాధితులు కిరణ్ కుమార్, జగదీష్, రాజలను తరుణ్ బృందం డబ్బులు రాబట్టుకునేందుకు కిడ్నాప్ చేశారని పోలీసులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కిరణ్ కుమార్, తరుణ్ ల మధ్య వ్యాపార లావాదేవీల్లో తలెత్తిన గొడవలే ఈ కిడ్నాప్ దారితీశాయని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details