ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసుల అదుపులో పిల్లల కిడ్నాప్​ ముఠా.. 9మంది అరెస్ట్​ - kidnap

విశాఖలో యాచకులు, అనాథ పిల్లలను కిడ్నాప్​ చేసి... అమ్మే ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కిడ్నాప్​ ముఠా గుట్టు విప్పిన విశాఖ పోలీసులు

By

Published : Aug 23, 2019, 3:59 PM IST

కిడ్నాప్​ ముఠా గుట్టు విప్పిన విశాఖ పోలీసులు
విశాఖలో యాచకులు, అనాథ పిల్లలను టార్గెట్ చేసుకుని కిడ్నాప్​లకు పాల్పతున్న ముఠా గుట్టు రట్టైంది. ఈ అరాచకాలు చేస్తున్న ప్రధాన నిందితులు సుమంత్, చందు, నాగమణి, లక్ష్మీతో సహా మొత్తం 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నలుగురు చిన్నారులును రక్షించి శిశు సంక్షేమ శాఖాధికారులకు అందించారు. పిల్లలు లేనివారిని ఆకర్షించి, అంతర్జాలంలో ఎత్తుకొచ్చిన పిల్లల ఫోటోలు పెట్టి ఈ ముఠా విక్రయిస్తోంది. గ్రామీణ ప్రాంతంలో ఉండే దంపతులకు ఒకో బిడ్డను యాబై నుంచి లక్షన్నరకు ఈ ముఠా అమ్ముతున్నారని విచారణలో తేలింది.

కొద్దిరోజుల క్రితం అభిరామ్ అనే బాలుడు కిడ్నాప్​ కేసును ఛేదించి... చందు అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు మూలాల్లోకి వెళ్లి విచారించగా మొత్తం ముఠా గురించి నిజాలు బయటపడ్డాయి.

For All Latest Updates

TAGGED:

kidnappolice

ABOUT THE AUTHOR

...view details