ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సరదాగా సాగరతీరానికి.. పోలీసులు పంపించారు ఇంటికి! - vishaka beach latest news

లాక్​డౌన్ కారణంగా 2 నెలలకు పైగా ఇంటికే పరిమితమైన విశాఖ ప్రజలు... ప్రభుత్వం ప్రకటించిన సడలింపులతో సాగరతీరంలో విహరించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు.

విశాఖ బీచ్ వద్ద యువత
విశాఖ బీచ్ వద్ద యువత

By

Published : Jun 4, 2020, 2:02 AM IST

విశాఖ బీచ్ లోని చల్లదన్నాన్ని ఆస్వాదించేందుకు నగర వాసులు క్యూ కట్టారు. కొందరు కుటుంబ సభ్యులతో రాగా.. మరి కొంత మంది స్నేహితులతో కలిసి వచ్చారు. పోలీసులు, తీర ప్రాంత గస్తీ సిబ్బంది వారిని అక్కడ నుంచి పంపించేస్తున్నారు.

వారంతా తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. పర్యాటక ప్రదేశాల్లో పూర్తి స్థాయిలో సంచరించేందుకు అనుమతులు లేని కారణంగా వారిని పంపించేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details