విశాఖ జిల్లా రావికమతం మండలం కళ్యాణలోవ జలాశయం పరిధిలో ఉన్న గ్రానైట్ క్వారీలపైగిరిజనులు,ప్రజాసంఘాల మద్య తలెత్తినభేదాభిప్రాయాలపై..నేడు కలెక్టరేట్ లో విచారణ జరగనుంది.గ్రానైట్ క్వారీలు వల్ల కళ్యాణలోవ జలాశయాని ఎలాంటి ఇబ్బంది ఉండదని గిరిజనలు అంటున్నారు.తమ ప్రాంతంలో ఉన్న4గ్రానైట్ క్వారీలతో వంద మందికి ఉపాధి లభించిందని, 40శాతం రాయల్టీ పన్ను తమ పంచాయితీకే దక్కుతుందని తెలిపారు.క్వారీలు ఉండటం వల్లే తమ ప్రాంతానికి రహదారి వచ్చిందని అంటున్నారు.ఈ కారణాలతోనే తాము గ్రానైట్ క్వారీలను సమర్ధిస్తున్నామని చెప్పారు.గిరిజనులు అభివృద్ధి చెందడం ఇష్టం లేక కొంతమంది కావాలనే గొడవ చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
'గ్రానైట్ తవ్వకాలతో మాకు ఉపాధి లభిస్తోంది' - గ్రానైట్ మైనింగ్‌కు మద్దతిస్తున్న విశాఖ గిరిజనులు
గ్రానైట్ తవ్వకాలతో కళ్యాణలోవ జలాశయానికి ఎలాంటి నష్టం లేదని విశాఖ జిల్లా రావికమతం మండలం కళ్యాణ గిరిజనులంటున్నారు. గిరిజనులు అభివృద్ధి చెందడం ఇష్టం లేకే ప్రజాసంఘాలు ధర్నా చేస్తున్నాయని ఆరోపించారు.
!['గ్రానైట్ తవ్వకాలతో మాకు ఉపాధి లభిస్తోంది'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4798774-782-4798774-1571456239432.jpg)
గ్రానైట్ మైనింగ్‌కు మద్దతిస్తున్న విశాఖ గిరిజనులు
గ్రానైట్ మైనింగ్‌కు మద్దతిస్తున్న విశాఖ గిరిజనులు