విశాఖలో కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా ఆదివారం చేపలు, రొయ్యలు, మాంసం అమ్మకాలను.. విశాఖ నగర పాలక సంస్థ నిషేధించింది. ప్రతి ఆదివారం రద్దీగా కనిపించే మాంసం దుకాణాలు ఖాళీగా దర్శనమిచ్చాయి. కరోనా వ్యాప్తి నివారణకు నగరంలో కర్ఫ్యూ, 144 సడలింపు సమయంలో గుంపులు గుంపులుగా జన సంచారం నియంత్రణకు ఈ నిర్ణయం తిసుకున్నట్టుగా అధికారులు తెలిపారు.
మాంసం విక్రయాలపై విశాఖ నగరపాలక సంస్థ నిషేధం - విశాఖలో మాంసం విక్రయాలను ఆపాలని ఆదేశించిన మున్సిపల్ అధికారులు
కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా.. ఆదివారం మాంసం విక్రయాలను విశాఖ నగరపాలక సంస్థ నిషేధించింది. మాంసం దుకాణాల వద్ద జనాలు ఎక్కువగా ఉంటుండటంతో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
vishaka municipal corporation