ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాడు-నేడుపై ఉపాధ్యాయులతో మున్సిపల్ కమిషనర్ సమీక్ష - vishakapatnam latest updates

నాడు- నేడు కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నంలోని వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో కార్పొరేషన్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో విశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ సృజన సమీక్ష నిర్వహించారు.

మాట్లాడుతున్న మున్సిపల్ కమిషనర్
మాట్లాడుతున్న మున్సిపల్ కమిషనర్

By

Published : Dec 6, 2020, 7:25 AM IST

నాడు- నేడు కార్యక్రమంలో భాగంగా విశాఖలో ప్రభుత్వ పాఠశాలల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఈ మేరకు విశాఖలోని వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో కార్పొరేషన్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో విశాఖ మున్సిపల్ కమిషనర్ సృజన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ..నాడు- నేడు ప్రణాళిక...విద్యార్థులకు అవసరమయ్యే మౌలిక వసతులు కల్పించే విధంగా ఉండాలని తెలిపారు.

స్మార్ట్ సిటీ మిషన్ లో భాగంగా కొన్ని పాఠశాలల్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అదనపు కమిషనర్ సన్యాసిరావు పాల్గొన్నారు. విశాఖను అత్యుత్తమ స్వచ్ఛ నగరంగా నిలిపే క్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల భాగస్వామ్యం ఎంతో కీలకమని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details