విశాఖ మన్యం బంద్ ప్రశాంతం - manyam bandh sucesess over Scrambled lands issue news
పోడు భూముల సమస్యలను తీర్చాలంటూ గిరిజనులు పిలుపునిచ్చిన బంద్ విశాఖ మన్యంలో ప్రశాంతంగా సాగింది. పలుచోట్ల వాహనాల రాకపోకలను నిలిపివేస్తూ రోడ్డుపై బైఠాయించారు.
Breaking News
పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘం ఆధ్వర్యంలో విశాఖ మన్యంలో చేపట్టిన బంద్ ప్రశాంతంగా సాగింది. పది రోజులుగా బంద్ పై విస్తృత ప్రచారం చేయగా... ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. దశాబ్దాలుగా మన్యంలో గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు ప్రభుత్వాలు పట్టాలు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నాయని గిరిజన నేతలు ఆరోపించారు. వాహనాల రాకపోకలను నిలిపివేసి రహదారిపై బైఠాయించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.