ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లాక్​డౌన్​లో మూగజీవాలకు అండగా.. - విశాఖలో లాక్​డౌన్​లో మూగజీవలకు అండగా

లాక్​డౌన్​ కారణంగా ఆకలితో ఉన్న మూగజీలు ఆకలి తీరుస్తున్నారు విశాఖ జిల్లా సబ్బవరానికి చెందిన కాటూరి రవీంద్ర. విశాఖ నగరంలో ఉన్న మూగ జీవాలకు తన పొలంలోని గ్రాసాన్ని అందిస్తున్నారు.

vishaka man giving food to cow
లాక్​డౌన్​లో మూగజీవలకు అండగా

By

Published : Apr 13, 2020, 5:14 PM IST

లాక్ డౌన్​లో ఆకలితో అలమటిస్తున్న మూగజీవాల ఆకలి తీర్చడానికి విశాఖ జిల్లా సబ్బవరం ప్రాంతానికి చెందిన కాటూరి రవీంద్ర నడుం బిగించారు. నిత్యం రెండు ట్రక్కుల్లో పశుగ్రాసం తీసుకువెళ్లి.. విశాఖ నగరంలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్న మూగజీవాలకు ఆహారం అందిస్తున్నారు. మనుషులను పెట్టి తన పొలంలో ఉన్న గడ్డిని కోసి అందజేస్తున్నారు. కాటూరి సూరన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మూగ జీవాలతో పాటు పేద ప్రజలకు నెలసరి సరకులను కూడా అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details