కరోనా నేపథ్యంలో విశాఖ కేజీహెచ్ ఆస్పత్రిలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని.. ఆసుపత్రి సూపరింటెండెంట్ అర్జున్ తెలిపారు. కేజీహెచ్ నాన్‌కోవిడ్ ఆసుపత్రి కావడం వల్ల అధిక సంఖ్యలో రోగులు వస్తున్నారని అన్నారు. ఆస్పత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ, డిస్ఇన్ఫెక్షన్ చర్యలను సమర్థంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఓపీ సేవలు తాత్కాలికంగా నిలిపివేశామని.. అత్యవసర సేవలు మాత్రమే అందిస్తున్నట్లు చెప్పారు. ఆస్పత్రికి వచ్చిన వారిలో కరోనా లక్షణాలుంటే వారిని ఐసోలేషన్ వార్డులకు తరలించేలా ఏర్పాటు చేశామన్నారు.
కేజీహెచ్‌లో తాత్కాలికంగా జనరల్ ఓపీ సేవలు నిలిపివేత - విశాఖ కేజీహెచ్
విశాఖ కేజీహెచ్ నాన్‌కోవిడ్ ఆసుపత్రి కావడం వల్ల అధిక సంఖ్యలో రోగులు వస్తున్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున్ అన్నారు. జనరల్ ఓపీ సేవలను తాత్కాలికంగా నిలిపివేశామన్న ఆయన.. 90 శాతం అత్యవసర సేవలు అందిస్తున్నామని తెలిపారు.
కరోనా వైద్యానికి విశాఖ కేజీహెచ్ సర్వీసులు