విశాఖ జిల్లా రోలుగుంట మండలం పసర్లపూడి గ్రామాల రైతులకు ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కరోనా సహాయాన్ని పంపిణీ చేశారు. గోపాలపట్నం గ్యాస్ లీకేజీ వ్యవహారంలో మృతి చెందిన కుటుంబాలకు ఆశాజనకమైన పరిహారాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారని ధర్మశ్రీ పేర్కొన్నారు. అలాగే రోలుగుంట మండలం కర్లపూడి గ్రామానికి కళ్యాణమండపానికి నిధులు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఇంత భారీ పరిహారం ప్రకటించిన ఘనత సీఎందే - విశాఖలో గ్యాస్ లీక్ వార్తలు
విశాఖజిల్లా గోపాలపట్నం గ్యాస్ లీకేజీ వ్యవహారంలో మృతి చెందిన కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారాన్ని ప్రకటించారు సీఎం జగన్. బాధిత కుటుంబాలకు సీఎం జగన్ ఆసరాగా నిలిచారని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు.
![ఇంత భారీ పరిహారం ప్రకటించిన ఘనత సీఎందే vishaka](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7110257-496-7110257-1588923200342.jpg)
vishaka