ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ సమీప గ్రామాల్లో గ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఎంత శుభ్రం చేసినా.. ఇళ్లలో రసాయన వాయువు ఉంటోంది. లాక్డౌన్ అని తెలిసి... కొనుకున్న వంట సామగ్రి అంతా రసాయనమయం కావడం వల్ల బయటే పడేశారు. ప్రస్తుతానికి ఎల్జీ పరిశ్రమ వీరికి ఆహారం అందిస్తోంది.
'మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి' - gas leakage impact on vishaka people news
విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన జరిగి పది రోజులు దగ్గర పడుతోంది. తిరిగి బాధిత గ్రామస్థులు తమ ఇళ్లకు చేరుకున్నారు. కొందరు మాత్రం బంధువుల ఇళ్లలో ఉంటూ తాత్కాలికంగా వచ్చి ఇళ్లు శుభ్రం చేసుకుని వెళ్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
vishaka gas leakage impact on people
ఎలాంటి పనులు లేక గ్యాస్ లీకేజ్ బాధిత గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విషవాయువుతో పాడిపశువులు మృతిచెందడంతో జీవనాధారం పోగొట్టుకున్నారు. ఇప్పటి వరకు వైద్య పరీక్షలు చేయలేదని.. కొంతమంది ఆందోళన చెందుతున్నారు. వెంటనే వైద్య సహాయం కావాలని కోరుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన సాయం కూడా ఇంకా అందలేదని చెబుతున్నారు.
ఇదీ చదవండి: స్టైరిన్ మోనోమర్ ఎగుమతికి ఏర్పాట్లు సిద్ధం: కస్టమ్స్ అండ్ జీఎస్టీ చీఫ్ కమిషనర్