మానసిక ప్రశాంతత కోసం డాక్టర్ సుధాకర్ అజ్ఞాతంలోకి వెళ్లారు. సుధాకర్‌ను ప్రభుత్వ మానసిక వైద్యశాలలో చేర్పించిందేవరన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆయనే స్వయంగా వచ్చారంటూ మానసిక వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ రాధారాణి ప్రకటన విడుదల చేశారు. సుధాకర్‌ను పోలీసులు కేజీహెచ్‌కు తీసుకురాగా ఓపీలో చూశామని.. ఆసుపత్రిలో హడావుడి సృష్టించడంతో మానసిక వైద్యశాలకు పంపామన్నారు. పోలీసులు వారి వాహనంలో తీసుకెళ్లారని కేజీహెచ్ ఉన్నతాధికారులు వివరించారు.
అజ్ఞాతంలోకి డాక్టర్ సుధాకర్ - doctor sudhakar underground news
వైద్యుడు సుధాకర్ ప్రభుత్వ మానసిక వైద్యశాల నుంచి డిశ్చార్జి అయ్యాక అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. విశాఖపట్నంలోని ఓ రహస్య ప్రదేశంలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సుధాకర్‌ను కలిసేందుకు ఐదు రోజుల దాకా ఎవరూ రాకూడదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
vishaka doctor sudhakar in under ground
కేజీహెచ్‌లో చేర్పించాక సుధాకర్ అక్కడి వైద్యుల అధీనంలో ఉన్నట్లేనని పోలీసులంటున్నారు. వారి సిఫారసుల ప్రకారమే తాము మానసిక వైద్యశాలకు తీసుకెళ్లాం. అంతేగాని సొంత నిర్ణయం తీసుకోలేదని పోలీసులు పేర్కొంటున్నారు. దీనిపై సీబీఐ అధికారులు దృష్టి సారించారు.
ఇదీ చదవండి: 'ఎస్ఈసీ పునర్నియామకం'పై.. ఈ నెల 10న సుప్రీంలో విచారణ
Last Updated : Jun 7, 2020, 12:01 PM IST