ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సురుగుడు పంచాయతీ శివారు గ్రామాన్ని పరిశీలించిన విశాఖ జేసీ - విశాఖ జేసీ వార్తలు

విశాఖ జిల్లా సరుగుడు పంచాయతీ శివారు గ్రామాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్, నర్సీపట్నం సబ్ కలెక్టర్ సంయుక్తంగా సందర్శించారు. లేటరైట్ ఖనిజ తవ్వకాల అనుమతుల కోసం దరఖాస్తులు రావటంతో సంబంధిత ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు.

vishaka district jc visit sragudu villages
సురుగుడు పంచాయతీ శివారు గ్రామాన్ని పరిశీలించిన విశాఖ జేసీ

By

Published : Sep 4, 2020, 12:12 PM IST

విశాఖ జిల్లా నాతవరం మండలం సరుగుడు పంచాయతీ శివారు గ్రామాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపరెడ్డి సంయుక్తంగా సందర్శించారు. ఈ ప్రాంతంలో సుమారు 22 హెక్టార్లలో లేటరైట్, ఎర్రమట్టి ఖనిజ తవ్వకాల అనుమతులు మంజూరు చేయాలని కోరుతూ... దరఖాస్తులు రావటంతో హుటాహుటిన రెవెన్యూ అధికారులతోపాటు మైనింగ్ శాఖ అధికారులు అటవీశాఖ అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించారు.

5 వేల ఎకరాలు విస్తీర్ణంలో ఉన్న మిగులు భూములు నిక్షేపాలు తవ్వకానికి అనుమతులు మంజూరు చేస్తే.. తమ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని గ్రామానికి చెందిన గిరిజనులు అధికారుల వద్ద వాపోయారు. సుమారు 20 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు మంజూరు చేయాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటిది ఈ ప్రదేశంలో లేటరైట్ నిక్షేపాలు తవ్వకాలకు అనుమతులు ఎలా మంజూరు చేస్తారని గిరిజనులు నిలదీశారు. గతంలో వీటి అనుమతులను రద్దు చేయాలని కోరుతూ పలు ఆందోళనలు చేపట్టిన తరువాత.. అనుమతులు రద్దు చేస్తే.. ఇప్పుడు మరలా ఏవిధంగా అనుమతులు ఇస్తారని ప్రశ్నించారు.

ఇదీ చదవండి:ఆలయ రికార్డులను ఆయనెలా పరిశీలిస్తారు?

ABOUT THE AUTHOR

...view details