ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భారీ వర్షాలపై అధికారుల అప్రమత్తత - బంగాళఖాతంలో అల్పపీడనం తాజా వార్తలు

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో విశాఖ జిల్లాలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు అధికారులంతా అప్రమత్తమయ్యారు. భారీవర్షాల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న విశాఖ జిల్లా కలెక్టర్ వినయ చంద్ తో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.

వర్షాల దృష్ట్యా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి: వినయ్ చంద్
వర్షాల దృష్ట్యా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి: వినయ్ చంద్

By

Published : Oct 12, 2020, 7:27 PM IST

భారీ వర్షాల దృష్ట్యా జిల్లాలోని అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. రేపు ఉదయం తీవ్రత పెరిగి విశాఖ - నరసాపురం మధ్య తీరం దాటుతుందని.. వాతావరణ శాఖ సమాచారంతో జిల్లాలోని అధికారులతో సమీక్షలు జరిపారు. ఆర్డీవోలు, ఇరిగేషన్, వ్యవసాయం, మత్య్స శాఖ, రహదారులు భవనాల శాఖ, తదితర శాఖల అధికారులతో మాట్లాడారు. జలాశయాలకు దిగువనున్న గ్రామస్థులను అప్రమత్తం చేసి నీటిని విడుదల చేస్తునట్టు కలెక్టర్ చెప్పారు.

పంట నష్టాలను పరిశీలించి నివేదికలను అందజేయాలని వ్యవసాయ శాఖ, ఉద్యాన వన శాఖ అధికారులను కలెక్టర్ వినయ్ చంద్ ఆదేశించారు. గ్రామ సచివాలయాల్లోని వ్యవసాయ సహాయకులు అప్రమత్తతతో ఉండాలని అన్నారు. రహదారులలో ఎక్కడైనా చెట్లు కూలి రవాణాకు అంతరాయం కలిగితే తక్షణమే వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ 0891-2590102, 0891-2590100 ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details