స్టైరీన్ ప్రభావానికి గురైన మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్ పై మరో నాలుగైదు రోజుల్లో తుది నివేదిక వస్తుందని విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ వెల్లడించారు. మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్ నీళ్లను వినియోగించడంపై నివేదక వచ్చిన తరువాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మేఘాద్రి గడ్డ నీటిలో అక్వాటిక్ టాక్సిటీ టెస్ట్ నిర్వహించారని చెప్పారు. నిపుణులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని వివరించారు. మళ్లీ అన్నిపెరా మీటర్లు టెస్ట్ చేస్తామన్నారు. ఈనెల 20న ఎల్జీ ప్రమాదంపై ఉన్నత స్దాయి కమిటీ తుది నివేదిక కోసం సమావేశమవుతుందన్నారు. అందులో పొందుపర్చే అన్ని అంశాలపైనా చర్చించే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు.
మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్ నీళ్లపై నాలుగు రోజుల్లో నివేదిక! - మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్ న్యూస్
విశాఖలో విషవాయువు ప్రమాదం తర్వాత అక్కడి చెట్లు మాడిపోయాయి. జంతువులు చనిపోయాయి. నీరు కలుషితం అయిందన్న అనుమానాలు వచ్చాయి. ప్రభావానికి గురైన మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్ నీళ్లని వినియోగించడంపై మరో నాలుగు రోజుల్లో నివేదిక రానుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.
vishaka collector