విశాఖ జిల్లా భీమునిపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి అరుదైన గుర్తింపు లభించింది.కేంద్రప్రభుత్వం ప్రతిపాధించిన కాయకల్ప విభాగంలో అత్యుత్తమ సేవలకు గాను జిల్లాలో భీమిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అవార్డు వచ్చింది.ఈ అవార్డు కింద ఐదు లక్షల నగదును అందజేశారు.పచ్చదనం పరిశుభ్రత,రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించే సేవలకుగాను ప్రథమ బహుమతి వచ్చిందని..వైద్య సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.ఆసుపత్రి ప్రాంగణాన్ని పచ్చని మొక్కలతో నిండి మనసుకు ఉల్లాసాన్నిచ్చేలా తీర్చిదిద్దారు.ఆసుపత్రి ప్రహరీ గోడలపై రోగులు పాటించాల్సిన ఆరోగ్య సూత్రాలు,నియమాలను రాశారు.ఆరోగ్యానికి అవసరమయ్యే మంచి విషయాలు పట్ల రోగుల్లో అవగాహన కలిగేలా ఆసుపత్రి సిబ్బంది ఉంటారని సూపరింటెండెంట్ సిద్ధార్థ తెలిపారు.
విశాఖ జిల్లా భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి కేంద్రప్రభుత్వ అవార్డు - bheemunipalem government hospital taken award for greenary
విశాఖ జిల్లా భీమునిపట్నం ప్రభుత్వ ఆసుపత్రి కేంద్ర ప్రభుత్వ గుర్తింపు లభించింది. పచ్చదనం, పరిశుభ్రత, రోగులతో వైద్య సబ్బంది వ్యవహరించే తీరులో ఈ ఆసుపత్రికి జిల్లాలోనే ప్రథమ బహుమతి లభించింది. ఈ బహుమతిపై వైద్య సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పచ్చదనానికి చిరునామాగా మారిన విశాఖ జిల్లా భీమునిపట్నం ప్రభుత్వ ఆసుపత్రి
పచ్చదనానికి చిరునామాగా మారిన విశాఖ జిల్లా భీమునిపట్నం ప్రభుత్వ ఆసుపత్రి