ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"యూపీలో దళితులకు భద్రత లేదు": అంబేద్కర్ సోసైటీ - విశాఖలో అంబేద్కర్ సోసైటీ ఆందోళన ..

దళిత మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నిరసిస్తూ విశాఖలోని అంబేద్కర్ సోసైటీ ఆందోళన చేపట్టింది. తాజాగా యూపీలో జరిగిన మనీషా వాల్మీకి కేసు విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం భాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని వ్యాఖ్యానించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

vishaka ambhathkar socity protest
అంబేద్కర్ సోసైటీ ఆందోళన

By

Published : Oct 3, 2020, 1:13 PM IST

ఉత్తరప్రదేశ్​లోని బలరాంపూర్ కి చెందిన విశాఖలో మనీషాపై జరిగిన అత్యాచారాలను వ్యతిరేకిస్తూ విశాఖలోని అంబేద్కర్ సోసైటీ ఆందోళన చేపట్టింది. ఆ రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ జీవీఎంసీ గాంధీ పార్క్ లో నిరసన ప్రదర్శన చేపట్టారు. భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయన్నారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మైనార్టీల విషయంలో భాధ్యతారాహిత్యంగా వ్యవహరించటం సరికాదన్నారు. ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయాలని అన్నారు. దళిత బాలికలపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details