విశాఖ మన్యానికి పర్యటకులు పోటెత్తారు. ఇవాళ ఈ ఏడాది చివరి ఆదివారం కావటంతో ఆంధ్రా కశ్మీర్ లంబసింగికి జనం అధిక సంఖ్యలో వచ్చారు. చెరువుల వేనం, తాజంగి జలాశయాల వద్దకు అధికసంఖ్యలో తరలివచ్చారు. ఉదయం ఆరు గంటల నుంచే చెరువుల వేనం వద్ద సందడి నెలకొంది. మంచు అందాలకు పర్యటకులు ఫిదా అయ్యారు. తాజంగి జలాశయం వద్ద జిప్‌లైన్‌లో ప్రయాణించేందుకు పోటీపడ్డారు. జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం వద్ద రద్దీ నెలకొంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పర్యటకులు వస్తూనే ఉన్నారు. జలపాతంలో పిల్లలు, పెద్దలు హుషారుగా గడిపారు. సీలేరులో ప్రకృతి అందాలను తిలకించేందుకు ఆంధ్రాతో పాటు తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో విచ్చేశారు.
ఆంధ్రా కశ్మీర్‌కు పోటెత్తిన పర్యటకులు - best tourist place in ap
మంచు దుప్పటి కప్పుకున్న విశాఖ మన్యం అందాలను చూసేందుకు పర్యటకులు పోటీపడ్డారు. ప్రకృతి సౌందర్యానికి ఫిదా అయిపోయి... ఉల్లాసంగా గడిపారు.

ఆంధ్రా కశ్మీర్‌కు పోటెత్తిన పర్యటకులు