ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

త్వరలో విశాఖ నుంచే పరిపాలన.. మంత్రి గుడివాడ అమర్నాథ్

IT Minister Gudivada Amarnath: విశాఖలో రెండు రోజుల పాటు జరిగిన ఇన్ఫెనిటీ వైజాగ్ 2023 ఐటీ సదస్సు ముగింపు సమావేశంలో ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. తమ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు వల్లే రాష్ట్రంలో వివిధ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని అన్నారు. రానున్న రెండు నెలల్లో విశాఖ రాజధానిగా మారబోతున్నట్లు పేర్కొన్నారు.

IT Minister Gudivada Amarnath
గుడివాడ అమర్నాథ్

By

Published : Jan 21, 2023, 7:27 PM IST

IT Minister Gudivada Amarnath: విశాఖలో రెండు రోజుల పాటు జరిగిన ఇన్ఫెనిటీ వైజాగ్ 2023 ఐటీ సదస్సు ముగింపు సమావేశంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గోన్నారు. ఐటాప్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికార్లు, వివిధ ఐటీ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. యాపిల్ కంపెనీతో విడిభాగాల తయారీల యూనిట్ విశాఖలో పెట్టడానికి ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయని మంత్రి వివరించారు. ఐటీ పరిశ్రమకు ప్రభుత్వం మరింతగా ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న ప్రతినిధులు, ఇందులో కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకునేందుకు ఇవి తోడ్పతాయన్నారు.

ఐటీలో విశాఖకు ఉన్న అవకాశాల చూపించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు మంత్రి తెలిపారు. విశాఖ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకు వస్తున్నాయని తెలిపారు. ఆయా సంస్థలు రాష్ట్రంలో తమ పట్టుబడులు పట్టడం ద్వారా మరింత మందికి ఉపాధి దొరుకుతుందని మంత్రి అమర్నాథ్ తెలిపారు. అందుకోసం తమ ప్రభుత్వం అనేక విధాలుగా కృషి చేస్తుందని వెల్లడించారు. విశాఖను మేజర్ ఐటీ కేంద్రంగా నేలకొల్పడానికి రాష్ట్రం ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

పరిపాలన రాజధానిగా విశాఖ: విశాఖ కేంద్రంగా ఐటీ పరిశ్రమలు 60 వరకు రావడానికి సిద్దంగా ఉన్నాయని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, ఐటీ హబ్ గా ఎదిగేందుకు కొత్తగా వస్తున్న ఈ కంపెనీలతో మరింతగా మార్గం ఏర్పడుతోందని వివరించారు. మరో రెండు నెలల్లో విశాఖ పరిపాలన రాజధానిగా కాబోతోందని.. మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఇందులో ఎటువంటి అనుమానాలు అక్కర్లేదన్నారు.

పరిపాలన రాజధాని గురించి ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వందలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి ఇక్కడ ఉండే అవకాశాలను గురించి వెల్లడించాం. విశాఖను ఐటీ కేంద్రంగా చేయడానికి సీఎం కృషి చేస్తున్నారు. హైదరాబాద్​తో​ పాటుగా.. ప్రపంచంలో ప్రతి చోట మన రాష్ట్రానికి చెందిన తెలుగు వారు ఉన్న నేపథ్యంలో వారు మన రాష్ట్రంలో ఉద్యోగాలు చేయడానికి మందుకు వస్తారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. అలాంటి వారికి అన్ని అవకాశాలు కల్పిస్తాం. రాష్ట్రంలో యాపిల్ కంపెనీకి చెందిన మ్యాన్​ఫ్యాక్చరింగ్ కోసం స్థానికి కంపెనీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. వారికి అన్నిరకాలుగా సహాయం చేసేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉంది. గుడివాడ అమర్నాథ్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి

ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details