ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 18, 2022, 7:14 PM IST

ETV Bharat / state

విశాఖ స్టీల్ ప్లాంట్.. నిర్వాసితుల గోడు వినే వారే లేరా..!

Steel Plant Expatriates Welfare Association గాజువాక పెద్ద గంట్యాడలోని స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల కాలనీ వద్ద టీడీపీ, స్టీల్ ప్లాంట్ నిర్వాసిత సంక్షేమ సంఘం ఒక రోజు నిరసన దీక్ష చేపట్టారు. ఎనిమిది వేల మంది నిర్వాసితుల జీవితాలు తేల్చకుండా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని చూడడం ముమ్మాటికీ దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

గాజువాక పెద్ద గంట్యాడ
Steel Plant Expatriates Welfare Association

Visakhapatnam Steel Plant: గాజువాక పెద్ద గంట్యాడలోని స్టీల్ ప్లాంట్ నిర్వాసిత కాలనీ వద్ద టీడీపీ, స్టీల్ ప్లాంట్ నిర్వాసిత సంక్షేమ సంఘం ఒక రోజు నిరసన దీక్ష చేపట్టింది. ఈ నిరసన దీక్షలో స్టీల్ ప్లాంట్ నిర్వాసిత సంక్షేమ సంఘం నాయకులూ, టీడీపీ నేతలు పాల్లగొన్నారు. కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ను నిర్వీర్యం చేస్తుందని అన్నారు. ప్రైవేటీకరణ చేయాలనీ మోదీ ప్రభుత్వం చేస్తున్న తీరును ఎండగట్టారు. ఇన్ని సంవత్సరాలు గడిచినా.. నిర్వాసితులకు సరైన నాయ్యం చేయడం లేదన్నారు.

ఎనిమిది వేల మంది నిర్వాసితుల విషయం తేల్చకుండా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని చూడడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాసితులకు, తెలుగుదేశం పార్టీ స్థానిక కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు ఈ నిరసనకు మద్దతు ఇచ్చారు. వారితో పాటుగా.. నిరసన దీక్షలో పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్​లో నిర్వహణ గాలికి వదిలేశారని, వేల కార్మికుల బ్రతుకులు రోడ్డుమీద లాగుతున్నారని నేతలు ఆవేదన వ్యక్తం చేసారు. విశాఖ వచ్చిన ప్రధాని స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడక పోవడం పూర్తిగా స్టీల్ ప్లాంట్ మీద నిర్లక్ష్య ధోరణియే అని నాయకులు విమర్శించారు. ప్రాణ త్యాగం చేసైనా సరే విశాఖ స్టీల్ ప్లాంట్​ను కాపాడుకుంటామని వెల్లడించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details